తవణంపల్లి అక్టోబర్ 10 మన ద్యాస
తవణంపల్లి ప్రాధమిక పాఠశాల లో అలింకో వారి సహకారంతో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, గాలి దిలీప్, ఎంఈఓ హేమలత, మోహన్ రెడ్డి చేతుల మీదుగా కిట్‌లను అందజేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ భవిత భవన నిర్మాణానికి కావలసిన అన్ని సదుపాయాలను తమ కుటుంబం తరఫున అందిస్తామని, అలాగే భవిత పిల్లలకు పెన్షన్లు రావడం లేకపోయినా, వాటిని స్వయంగా కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో హెచ్.ఎం. వేణుగోపాల్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏఈ మునిరత్నం సహిత విద్య ఉపాధ్యాయులు దేవేంద్ర, దిలీప్, భవిత పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.







