నెల్లూరు నగరం 9వ డివిజన్లో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సిపి జనరల్ బాడీ సమావేశం

మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 6:నెల్లూరు నవాబు పేట నజీర్ తోటలో సోమవారం వైఎస్ఆర్సిపి 9వ డివిజన్ జనరల్ బాడీ సమావేశానికి.. హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి . ఈ సందర్భంగా డివిజన్ నాయకురాలు ధనుజా రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.మొదట డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను స్థానిక నేతలతో కలిసి.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పై కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలను.. పలువు నేతలు వివరించారు. అనంతరం 9వ డివిజన్ ఇంచార్జిగా ధనుజా రెడ్డి ని, కో ఆర్డినేటర్ గా వాసిఫ్ ను పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……. ఈరోజు 9వ డివిజన్లో వైఎస్ఆర్ సీపీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 9 వ డివిజన్ లో వైఎస్ఆర్సిపి సీనియర్ నేతగా మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ .. పార్టీ నిర్మాణం కోసంధనుజా రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఈరోజు ధనుజా రెడ్డి ని వైఎస్ఆర్సిపి 9వ డివిజన్ అధ్యక్షురాలుగా, వాసిఫ్ ను డివిజన్ కో ఆర్డినేటర్ గా ఎన్నుకోవడం.. జరిగిందన్నారు.ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బలోపేతం అవుతూ.. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలబడుతున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.9 వ డివిజన్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించిన విధంగా.. డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు.ఈరోజు వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న..వారి వివరాలను ఈ డిజిటల్ బుక్ లో.. నమోదు చేసి.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ.. చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుందని. భవిష్యత్తులో ఆ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన.. అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ప్రజల విశ్వసిస్తున్నారని..అన్నారు.ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే.. విజయమన్నారు.తొందర్లో నగర నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో కమిటీలను పూర్తి చేసి.. పార్టీ ని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని తెలిపారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!