నెల్లూరులో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం

మన ధ్యాస ,నెల్లూరు , అక్టోబర్ 6: నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగి మురళీధర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డితో పాటు విద్యార్థి సంఘం నాయకులు, రిటైర్డ్ అధ్యాపకులు, పలువురు మేధావులు పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయం.. అసంబద్ధ నిర్ణయమని.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తమ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైద్య విద్య అభ్యసించాలనుకున్న పేద విద్యార్థులకు.. ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ఒక శరాఘతంగా మారనుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. వైద్య విద్యను..పేద ప్రజలకు చేరువ చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….. మెడికల్ కళాశాలలను తీసుకురావడం అనేది.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి.. అందుకు సంబంధించిన అనుమతులన్నీ తీసుకురావడం అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్న నిర్ణయం అని అన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి.. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను చెరువ చేసే దిశగా శ్రీకారం చుట్టారని తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రాష్ట్రానికి ఇన్ని మెడికల్ కళాశాలలు తీసుకువచ్చిన.. ఘనత ఎక్కడా లేదన్నారు.దశలవారీగా వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో.. జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారన్నారు.అనుకున్నది అనుకున్నట్టుగా 2023 ఏడాదిలో ఐదు మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ప్రారంభించారని తెలిపారు.2025 కు మరో అయిదు కాలేజీలు పూర్తిచేసే లక్ష్యంతో.. 2024 ఏడాదిలో పాడేరు మెడికల్ కళాశాలను పూర్తి చేశారని తెలిపారు.ఇలా జగన్ మోహన్ రెడ్డి ఒక లక్ష్య సాధనతో మెడికల్ కళాశాలలను పూర్తిచేసే దిశగా ప్రక్రియ ప్రారంభిస్తే..కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు.. ఈరోజు వాటన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా.. నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు.జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మిగిలిన 11 మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే 23 సంవత్సరాలు పడుతుందని.. చంద్రబాబు నాయుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా.. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించి వసతులు సమకూర్చడం, అలాగే ఆర్బికేలు,విలేజ్ హెల్త్ క్లినిక్ లు, గ్రామ వార్డు సచివాలయాలను.. ఇలా ఎన్నో సంస్కరణలను ఒక లక్ష్య సాధన దిశగా పూర్తి చేశారని గుర్తు చేశారు .11 మెడికల్ కళాశాలల్లో పిడుగురాళ్ల మెడికల్ కళాశాల కేంద్ర నిధులతో పూర్తవుతుంది కనుక.. మిగిలిన 10 కళాశాలలను పూర్తి చేసేందుకు.. 6 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని.. దీనిని మేం భరించలేము అందుకే ప్రైవేట్ కు ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతుండడం కుట్రపూరితమన్నారు.ముఖ్యంగా పులివెందుల మెడికల్ కళాశాల గురించి చంద్రబాబు నాయుడు.. గతంలో మాట్లాడుతూ .. పులివెందుల మెడికల్ కళాశాల.. అన్ని వసతులతో పూర్తయింది కేవలం.. స్టాప్ మాత్రమే లేరు.. వారిని మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పిన.. చంద్రబాబు నాయుడు.. ఈరోజు పులివెందుల మెడికల్ కళాశాలను.. పి పి పి మోడ్ లో ప్రైవేటుకు అప్పగించడం సిగ్గుచేటు అన్నారు. 10 మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే 6000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న చంద్రబాబు నాయుడు.. మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు కాగా.. అందులో 2% అంటే 6000 కోట్ల రూపాయలు.. ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలో పూర్తి చేయచ్చు అన్న.. కనీస ఆలోచన కూడా ఆయనకు చేయలేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. లక్ష కోట్ల రూపాయలతో అమరావతి నిర్మిస్తామని.. చెబుతూ ప్రగల్బాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు.. మెడికల్ కళాశాలలను అందుబాటులో తీసుకురావడానికి 6 వేల కోట్ల ఖర్చు చేయలేకపోవడం.. విడ్డూరమన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను చెరువ చేసే వ్యవస్థ.. మెడికల్ కళాశాల అని.. ఈరోజు అలాంటి మెడికల్ కళాశాల వ్యవస్థను.. చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేయడం అనాలోచిత నిర్ణయం అన్నారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారా .. ఎంతోమందికి .. మెరుగైన వైద్య సేవలు అందించి.. వైద్యులు పారామెడికల్ సిబ్బంది వారి ప్రాణాలను కాపాడగలిగారని తెలిపారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలల సేవల.. ఆవశ్యకతను గుర్తించి.. జగన్మోహన్ రెడ్డి నూతన మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుడితే.. ఈరోజు మా వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు.. లావపేక్షతో ప్రైవేటుకు అప్పగించడం.. సరైన నిర్ణయం కాదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి మార్చుకొని.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దిశగా తీసుకున్న నిర్ణయాన్ని.. సంహరించుకోవాలని.. లేదంటే భవిష్యత్తులో.. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఉధృత పోరాటం చేస్తుందని.. ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!