ఉదయగిరి అక్టోబర్ 5 :(మన ధ్యాస న్యూస్):///
ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ, మాసాయిపేట గ్రామంలో షేక్ పీర్ అహ్మద్ – షరీఫా దంపతుల కుమార్తె షేక్ సాజిన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నవ వధువుకు పెళ్లి కానుకగా రూ. 10 వేల రూపాయలను అందజేశారు.ఈ సహాయాన్ని ట్రస్ట్ ప్రతినిధులు వధువు కుటుంబానికి వ్యక్తిగతంగా అందజేశారు. శాసనసభ్యుడు కాకర్ల సురేష్ సేవా మనసుకు కృతజ్ఞతగా, వధువు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్థానిక ప్రజలకు సహాయం చేయడం, సమాజంలో అవసరమైన వర్గాలను ఆదుకోవడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జల్సా యాదవ్, హరీష్, గంగాధర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.









