
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: శరన్నవరాత్రుల్లో భాగంగా ఏలేశ్వరం పలు వీధుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవ మండపాల్లో ఆదివారం మహాచండి మాత అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక తోటవీధిలో గత 42 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం మహాచండి మాత అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూప దీప నైవేద్యాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా ఉపవాసం ఉన్న భక్తులు చీర సారే వివిధ రకాల వంటకాలను అమ్మవారికి సమర్పించారు.అనంతరం వివిధ శరన్నవరాత్రి ఉత్సవ మండపాలలో నెలకొన్న అమ్మవార్లను భారీ ఊరేగింపుగా మహిళలు తరలి వెళ్ళి దర్శించు కున్నారు. భాజా భజంత్రీలతో,సారే పెళ్ళాంతో మహిళలు బారులు తీరి పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు.దిబ్బలపాలెం చిన్న మాస్టర్ ఇంటివద్ద లక్కవరం కాలనీ లో నెలకొల్పిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి నిర్వహిస్తున్న ఉత్సవ మండపంలో మహా చండి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారి కి ఉదయం ధూప దీప నైవేద్యాలతో భక్తులు విశేష పూజలు అందించారు. అమ్మవారికి చీర సారే సమర్పించిన భక్తులు వీధుల్లో వివిధ మండపాల్లో నెలకొన్న అమ్మవార్లకు చీర, సారే , వివిధ రకాల వంటకాల స్వీట్లు చూపించి పురవీధుల్లో ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తోటవీధి, దిబ్బలపాలెం దేవీ నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు,భారీ సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.









