బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ రెండవసారి నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జే.ఈశ్వర్ బాబు,అధ్యక్షులుగా కే. బాలాజీ,ప్రధాన కార్యదర్శిగా జే. సురేంద్రబాబు,సంయుక్త కార్యదర్శిగా వి. గోపి,కోశాధికారిగా పి. చిరంజీవి,ఉపాధ్యక్షులుగా కేపీ. రంగనాథ్, సభ్యులుగా ఇ.నాగరాజు,ఆర్ ఎన్ జ్యోతినాథ్,టి.కిరణ్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కే. బాలాజీ మాట్లాడుతూ, మండలంలో 41 పంచాయతీలలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న ప్రెస్ క్లబ్ దృష్టికి తేవాలని, అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలు తీర్చేందుకు పోరాడుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *