శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో వెలుగు కార్యాలయం నందు శుక్రవారం “ఉద్యమ్ ఆధార్ నిర్వహించబడింది ఈ కార్య ‘క్రమాన్ని ఏపిఎం వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి అధికారులు హాజరై మాట్లాడుతూ ఉద్యమ్ ఆధార్ అనేది భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మరియు మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎంఈఎస్) తమ వ్యాపారాలను సులభంగా, ఉచితంగా, ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి రూపొందించిన ఒక కేంద్ర ప్రభుత్వం ప్రమాణిత రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఈ ఎమ్ఎస్ఎంఈఎస్ రిజిస్ట్రేషన్ ద్వారా పలు ప్రయోజనాలు పొందగలవు, వీటిలో సులభమైన బ్యాంక్ సేవలు పొందడం, ప్రభుత్వ పథకాలలో భాగం కావడం, వ్యాపార గుర్తింపు పొందడం వంటి అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. అని తెలిపారు. ఈ క్యాంప్ లో స్థానిక వ్యాపారస్తులు తమ. ఎమ్ఎస్ఎంఈఎస్ వివరాలను నమోదు చేసుకొని, ఆన్లైన్ సర్టిఫికేట్ పొందే అవకాశం కలుగుతుంది. అలాగే, కొత్తగా వ్యాపారం ప్రారంభించదలచిన వ్యాపారస్తులకు కూడా అన్ని వివరాలు, సలహాలు అందించబడతాయి., ఏపీఎం వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రతి ఎమ్ఎస్ఎంఈఎస్ వ్యాపారం ఉద్యమ్ ఆధార్ ద్వారా అధికారిక గుర్తింపు పొందడం చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో వ్యాపార వృద్ధికి ప్రోత్సాహం కలుగుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పలువురు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.







