నరేగా నిధులను ఐదు లక్షల నుండి 50 లక్షలు పెంచాలని సభాపతి ద్వారా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
అమరావతి సెప్టెంబర్ 26:(మనధ్యాస న్యూస్ ):///
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అసెంబ్లీ సభా వేదికగా ప్రశంసించారు. శుక్రవారం శీతాకాలం అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ 150 రోజులలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసిన మంత్రి నారా లోకేష్ బాబు పై ప్రశంసల జల్లు కురిపించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన ఉదయగిరిలో 8 మండలాలు ఉన్నాయని ఇక్కడ సిసి రోడ్లు పక్కన డ్రైన్లు నిర్మించాలంటే నరేగా నిధులు ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ప్రకారం ఐదు లక్షల లోపు మాత్రమే వాడుకునేందుకు వీలవుతుందని దీనివల్ల నిధులు సరిపోక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి నరేగా నిధులు ఐదు లక్షల నుండి 50 లక్షలకు పెంచాలని విన్నవించడం జరిగిందని అది త్వరగా అమలయ్యేలా చూసి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి మరింత పెరిగేలా చూడాలని కోరారు.