ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- విజయవాడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై సుదీర్ఘం పాటు చర్చించారు. అదేవిధంగా జీడి నెల్లూరులో జరుగుతున్న రాజకీయాలను వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలకు అండగా నిలవాలని ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించాలని మాజీ ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *