శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): దేవీ నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ జిల్లా లయన్స్ క్లబ్ ఛైర్‌పర్సన్ పర్వత జానకి దేవి అమ్మవారికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి లో శ్రీ శ్రీనివాస వర్తక సంఘం, ఆధ్వర్యంలో దుర్గాదేవి కమిటీ సభ్యుల దేవీ నవరాత్రుల మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా లయన్స్ క్లబ్ ఛైర్‌పర్సన్ పర్వత జానకి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి అనంతరం శాలువాతో సత్కరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పర్వత జానకి దేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వత జానకి దేవి రాజబాబు అభిమానులు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.







