శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా కిర్లంపూడి లో మంగళవారం మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం తో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా భేటీ అయ్యారు. ముద్రగడ నివాసం లో నియోజకవర్గ వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం లో రాజా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని పార్టీకి సేవలు అందించాలన్నారు. కార్యకర్తలంతా పార్టీ బలోపేతానాకి కష్టపడి పనిచేసి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు యనుమల కృష్ణుడు, గౌతు స్వామి పోల్నాటి శేషగిరి, లాలం బాజ్జీ, నాగం దొరబాబు, తదితరులు పాల్గొన్నారు







