తవణంపల్లి సెప్టెంబర్ 20 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరము ను శనివారం వెంగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరం ద్వారా చేపట్టే పలు రకాల చికిత్సలను గ్రామంలోని ప్రజలకు రక్త పోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, తల్లి బిడ్డ ఆరోగ్య సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరిక్షలు, కిశోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి, అనీమియా స్క్రీనింగ్ ఆయుష్ సేవలు, ఇలా పలు రకాల వైద్య పరీక్షలను మండల వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక డాక్టర్ మోహన్ వేలు, వైద్య సిబ్బందులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం పట్ల మెలకువలు సూచన సలహాలు తెలియజేస్తూ, జాగ్రత్త పాటించాలని వారిని ఉద్దేశించి తెలిపారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్ఞాన శేఖర్, ఆరోగ్య పర్యవేక్షకులు కార్యకర్తలు ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎం లు ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు, స్థానిక గ్రామ సర్పంచ్ రాజేశ్వరమ్మ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.