మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

-మండలం వైధ్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్‌ నారీ – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ను రూపొందించిందని ఈ నెల 17 నుండి చేపట్టే ఆరోగ్య మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శంఖవరం మండలం వైధ్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు.కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఎస్ఎస్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన వైద్య సిబ్బందితో స్వస్థ్‌ నారీ – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఈ యోజన ప్రధాన ఉద్దేశ్యం దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రతీ ఆసుపత్రి, సబ్ సెంటర్లు, అంగన్వాడి కేంద్రాలు, హెచ్ డబ్ల్యుసి ఆరోగ్య మందిరాలులో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరగుతుందన్నారు. వీటిలో ప్రత్యేక నిపుణులైన వైద్యులతో మహిళలకు రక్త పరీక్షలు చేసి, రక్త హీనత కోసం, బిపి, షుగర్, టిబిపరీక్షలు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, కౌమార బాలికలకు రక్త పరీక్షలు, గిరిజన ప్రాంతాల వారికి సిక్లెసల్ అనీమియా పరీక్షలు, ఐరన్, కాల్షియం మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు.వీటిని మహిళలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని రాజీవ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో వైద్యులు మోహన్ సాయిరెడ్డి, రవిశంకర్, సిహెచ్ఎ మేరీ మణి, పిహెచ్ఎన్ కృష్ణకుమారి, హెచ్ విలు వెంకటలక్ష్మి, విజయ కుమారి,సూర్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి ఎర్రబ్బాయి, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

  • Related Posts

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి :-ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు…

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    అనుమతులు లేవంటూ ఆరోపించిన మేకల కృష్ణ… శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రభుత్వం నుండి ఏ విధమైనఅనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ను తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు కు శంఖవరం గ్రామానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్