
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 4:అన్ని దానాలలో కెల్లా విద్యా దానం గొప్పదని మరో సారి చాటి చెప్పింది విపిఆర్ ఫౌండేషన్. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో గురువారం గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థినికి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 1 లక్ష రూపాయల చెక్కు అందచేసి దాతృత్వం చాటుకున్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .నెల్లూరు నగరం పడారుపల్లికి చెందిన వైష్ణవి గతంలో విపిఆర్ విద్యా సంస్థలలో విద్యనభ్యసించింది. విపిఆర్ విద్యాసంస్థలో ప్రతిభావంతులైన విద్యార్థుల పై చదువులకు ప్రోత్సహిస్తూ ఆర్ధిక సహాయం అందచేసే ఆనవాయితీ కొనసాగింపుగా వైష్ణవికి ఆర్ధిక సహాయం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ధిక సహాయం అందుకున్న వైష్ణవి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలిపింది.
