నెల్లూరు నగర, మినీ బైపాస్ రోడ్ లో ఉన్న జి పి ఆర్ కళ్యాణమండపం లో గురువారం సాయంత్రం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పో వారి ఎగ్జిబిషన్ కం సేల్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటం రెడ్డి గీతారెడ్డి ప్రారంభించినారు .ఈ సందర్భంగా కోటంరెడ్డి గీతారెడ్డి మాట్లాడుతూ……. స్త్రీలకు ఇష్టమైన చీరలు ఎగ్జిబిషన్ ను నెల్లూరులో ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ…… నేను ఇండియన్ సెంట్రల్ సిల్క్ ఎక్స్పో లో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్డ్ అయినాను. తర్వాత వివర్స్ కు మంచి అవకాశం చూపించాలని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్ పోను 2022 సంవత్సరంలో ప్రారంభించినాను అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను ఇండియా లెవెల్ లో ఉన్న వీవర్స్ లతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎక్స్ పో ను ప్రారంభించడానికి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి గీతారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఎగ్జిబిషన్ ను సెప్టెంబర్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఐదు రోజులు మాత్రమే అని అన్నారు .దసరా, దీపావళి పండుగల సందర్భంగా నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో బనారస్ ప్రత్యేక ఆకర్షణ, పశ్చిమ బెంగాల్ బోటిక్ వస్తువులు , టసార్ కాంత్ అప్రింటెడ్, చందేరి మహేశ్వరి కోటా, రాజ్ కోట్ ,ఏటాల ,కచ్ బందివి, బెంగళూరు ప్యూర్ క క్రాస్ సిల్క్స్, బీహార్ మరియు జార్ఖండ్ టస్సార్ వస్త్రాలు మెటీరియల్స్, గద్వాల్, కలంకారి ,కాంచీపురం, పైతాని చీరలు, వెంకటగిరి ,ఉప్పాడ, జమాద్దాన్ని చీరలు మరియు కాటన్ దుస్తులు మెటీరియల్స్ ,బెడ్ బినెలో, ఆభరణాలు 100% చేనేత వస్త్రాలు ఇక్కడ లభించును అని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో వస్త్రాల కొనుగోలు పై 20% డిస్కౌంట్ కలదు అని అన్నారు. నెల్లూరు నగర మహిళలు ఎగ్జిబిషన్ కు విచ్చేసి మమ్ములను ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము అని అన్నారు .ఇతర వివరములు కొరకు 95735 53337; 9000346337లో సంప్రదాయాన్ని తెలియజేశారు.














