

ఉదయగిరి సెప్టెంబర్ 4 :మన ద్యాస న్యూస్ ప్రతినిధి :////
చిన్న వయసులో అంగవైకల్యం కలిగి ఉన్న విద్యార్థుల ప్రత్యేక అవసరాలు తాను బాధ్యతగా తీసుకొని వారి అవసరాలు తీరుస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ నందు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగము ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణ నిర్ధారణ శిబిర కార్యక్రమం గురువారం విద్యాశాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ప్రత్యేక అవసరాలు అవసరమైన విద్యార్థుల భవితకు తాను తోడుంటానని వారిని విద్యావంతులను చేసే బాధ్యతను తీసుకుంటానని ఇందుకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 352 మందికి పైగా ప్రత్యేక అవసరాలు అవసరమైన విద్యార్థులు ఉన్నట్లు వారందరినీ ఈ వేదిక వద్దకు తీసుకురావడం వారికి నిర్ధారణ పరీక్షలు చేయించిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి మండల కేంద్రంలో విద్యా వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భవిత కేంద్రానికి వచ్చే విద్యార్థులకు వారి అటెండర్ లకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్థిక సాయం పలు రకాలుగా అందించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక అవసరాల విద్యార్థుల తల్లిదండ్రులు వారి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని విద్యావంతులను చేస్తే వారు వారి జీవనాన్ని కొనసాగించేందుకు చదువు ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటారని కాబట్టి ప్రతి ప్రత్యేక అవసరమైన విద్యార్థి తల్లిదండ్రులు శ్రద్ధగా ప్రభుత్వం అందించే సౌకర్యాలతో వారిని విద్యావంతులు చేయాలని కోరారు. వీరికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఇచ్చిన భరోసాతో వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల శాఖ అధికారులతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాల విద్యార్థులు పాల్గొన్నారు.