నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్…… రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో 47 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏడాదిన్నర కాలంలో 183 మందికి రూ. 2.15 కోట్ల నిధులు పంపిణీ – అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం – రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ . ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరు సిటీ నియోజక వర్గంలోని 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్ధిక స్థోమత లేని వారికి సీఎం సహాయనిధి సంజీవినిలా నిలుస్తోందన్నారు. పరిస్థితి బాగోలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజక వర్గంలోనే ఏడాదిన్నర కాలంలో 183 మందికి 2 కోట్ల 15 లక్షల రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. పేదలకు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొట్టాయని హర్షం వ్యక్తం చేశారు. విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నారని తెలియజేశారు. పరిశ్రమల స్థాపిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడిలో పడుతుందన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మన ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను గత ప్రభుత్వం ఆపేసిందని, అయితే గత ప్రభుత్వంలో మంజూరైన పనులు మన ప్రభుత్వంలో కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఏమి కావాలో అది చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ,మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, కార్పొరేటర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..