

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ సర్వతో ముఖాభివృద్దికి ఉత్తమమైన వాటిని మీ బిడ్డకు ఇవ్వడం కోసం, మేము లీడ్ సిస్టం ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రతి విద్యార్థికి జీవితంలో విజయం సాధించేందుకు ఐదు స్కిల్స్ తో అవకాశం కల్పిస్తూ,లీడ్ సిస్టంతో విద్యార్థులు,ఉపాధ్యాయు లు సదుపాయాలు పొందుటకు,వారి పురోగతిని గుర్తించి తెలుసుకోవడానికి లీడ్ స్టూడెంట్ ఆప్ యాక్సిస్ లభించడం కోసం ముఖ్యంగా లీడ్ మాస్టర్ క్లాస్ మరియు ఛాంపియన్ షిప్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అవకాశం కల్పించి అభ్యాస ప్రయాణాన్ని ఆరంభించి జీవితంలో ఎలా విజయం సాధించగలరో తెలుసుకోవడం కోసం అంతర్జాతీయ ప్రామాణిక విద్య కోసం విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నామని,ఈ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు స్పందిస్తూ మా బిడ్డలకు ఉత్తమమైన వాటిని ఇవ్వండి అంతర్జాతీయ ప్రామాణిక విద్య అందిస్తున్నారని మెచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.