

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుని నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి శ్రేణులతో ముద్రగడ నివాసం కోలాహాలంగా మారింది.ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ఆయనని పలువురు వైసీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నేత గిరిబాబు నాయకత్వంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవిందుతో పాటు యర్రవరం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు,ప్రత్తిపాడు సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం,అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు దలే చిట్టిబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ,గుల్లంపూడి గంగాధర్,యువ నాయకులు బీశెట్టి స్వామి,బుద్ధ గణేష్,శేఖర్, చిలకమర్తి వెంకటరమణ, చిలకమర్తి భాస్కర్ తదితరులు గిరిబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు