

కలిగిరి: మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు :////
కలిగిరి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కాకు మహేష్ తాతగారు దొడ్ల వెంకటరత్నం గారు ఈ ఉదయం పరమపదించారు. ఈ దుర్వార్త తెలుసుకున్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు గారు వెంటనే కాకు మహేష్ నివాసానికి చేరుకున్నారు.పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదారుస్తూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్దలను కోల్పోవడం ప్రతి కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి కష్టకాలంలో తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని బొల్లినేని,భరోసా ఇచ్చారు.