

మన న్యూస్, వెంకటాచలం, ఆగస్టు 24 : * వెంకటాచలం మండలం గొలగమూడిలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. *సోమిరెడ్డికి భారీ గజమాలతో ఘన స్వాగతం. *ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతమ్మకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ ఈఓ బాలసుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు.*భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సోమిరెడ్డి కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు.*శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం వెంకయ్య స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి.*ఆలయ మర్యాదల ప్రకారం సోమిరెడ్డి దంపతులకు సత్కారం.మన ధ్యాస, వెంకటాచలం ,ఆగస్టు 24:నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధనోత్సవాలు సందర్భంగా ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమిరెడ్డి దంపతులకు స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాద స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ……….భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధనోత్సాల్లో భాగస్వామిని కావడం, పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.స్వామి వారి ఆశీస్సులతోనే ఆయనకు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం నాకు దక్కింది అని అన్నారు.రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ప్రజలందరికీ మంచి జరిగి అందరూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని కోరుకున్నా అని అన్నారు.వెంకయ్య స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతుండటం గొప్ప విషయం అని అన్నారు.ఆశ్రమ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్నారు..జూనియర్ కళాశాల ప్రారంభించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారు.శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నా అ దృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.




