

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను భీమవరం వైసీపీ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకట్రాయుడు కలిశారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు ను చిన్నమిల్లి వెంకట్రాయుడు, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భీమవరం వైసీపీ ఇంచార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం నీతి నిజాయితీ గల నాయకుడు అని రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.