షిప్‌ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్

Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్‌ను సీజ్ చేశామని చెప్పారు.సీజ్ చేసే చట్టాలు ఉన్నాయని, అంతర్జాతీయ షిప్ అయినా కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న అధికారుల ప్రమేయం ఉందని, అందరిపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో వైసీపీ ప్రభుత్వం బియ్యం మాఫియా చేసిందని అన్నారు. డోర్ డెలివరీ వ్యాన్లతో ప్రజల దగ్గర 10 రూపాయిలకు కొనుగోలు చేసి బియ్యాన్ని సేకరించారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలించారని వివరించారు. కాకినాడ సీ పోర్టుకి అరబిందో ఎలా ప్రవేశించిందని అడిగారు. పోర్టుని పూర్తిగా స్వాధీనం చేసుకోడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేశారని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, ఉగ్రవాదుల ముప్పు ఉండదని మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. అంత పెద్ద పోర్టుకి 20 మంది భద్రత పెట్టారని, దీని వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. కాకినాడను స్మగ్లింగ్ కేంద్రంగా మార్చేశారని, మంచి నగరానికి చెడ్డపేరు తీసుకునివచ్చారని తెలిపారు.మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టాకింగ్ పాయింట్స్ లో తనిఖీలు చేస్తున్నానని చెప్పారు. జూన్ 28 తేదీన 13 గోడౌన్స్ సీజ్ చేశామని, 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. 13 కంపెనీలు కోర్టుకి వెళ్తే.. కోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేశామని చెప్పారు.

Related Posts

వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • December 9, 2025
  • 3 views
సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

  • By RAHEEM
  • December 9, 2025
  • 3 views
మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

  • By RAHEEM
  • December 9, 2025
  • 6 views
చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు