



మన న్యూస్, నిజాంసాగర్:( జుక్కల్ )
ఇటీవల భారీ వర్షాల కారణంగా హసన్‌పల్లి గ్రామంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ స్వయంగా బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకునేలా చేశారు.గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వృద్ధులను కనీస అవసరాల కోసం ఆర్థిక సాయం అందించి, వారి సురక్షిత నివాసం కోసం వేరే చోటుకు తరలించారు. వర్షాల కారణంగా వ్యాపించే సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా జ్వరం వంటి సమస్యలను నివారించేందుకు వైద్య అధికారులతో చర్చలు జరిపి గ్రామానికి మందులు అందేలా చేశారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ముందుండి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన నిఖిల్‌పై గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఆయన వెంట నాయకులు బోయిని హరికుమార్,వెంకట రాములు,పార్వయ్య,శంకర్,తదితరులు ఉన్నారు.