నెల్లూరులో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరత్నం హాస్పిటల్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 17: నెల్లూరులో ,పొగతోట ,సండే మార్కెట్ దగ్గర, సుబ్రహ్మణ్యం గుడి పక్క వీధి లో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీ రత్నం హాస్పిటల్ 30 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించినారు.ఈ భారీ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ పిట్టి.మల్లికార్జునరావు( ఊపిరితిత్తులు వ్యాధి నిపుణులు) డాక్టర్ పిట్టి. వినాయక సందీప్ (ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు) డాక్టర్ పిట్టి .భారతి (కానుపులు, గర్భకోశ వ్యాధినిపుణులు) డాక్టర్ సాత్విక బొనిగి (జనరల్ ఫిజీషియన్) పాల్గొని రోగులను పరీక్షించి ,ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు మాట్లాడుతూ….. మా శ్రీ రత్నం హాస్పిటల్ స్థాపించి 30 సంవత్సరాల అయిన సందర్భంగా హాస్పిటల్లో నందు భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు నిర్వహించాము అని అన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో నేను,డాక్టర్ పిట్టి. భారతి, డాక్టర్ పిట్టి .వినాయక సందీప్ ,డాక్టర్ సాత్విక బొనిగి పాల్గొని రోగుల పరీక్షించి, రక్తపరీక్షలు, ఈసీజీ అవసరానికి ఎక్స్ రేలు తీయించి మందులు ఉచితంగా ఇచ్చాము ,రోగులకు ఆహారం కూడా సరఫరా చేసాము అని అన్నారు.ఈ ఉచిత శిబిరం నందు శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ వారి సహాయ సహకారముతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శుక్ల మల ఆపరేషన్ ఉచితంగా చేయించబడును అని అన్నారు.శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు అయింది .ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము అని అన్నారు.దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ…… డాక్టర్ అంటే దేవుడితో సమానం ,మనకు ఏ ఆపద వచ్చినా డాక్టరే గుర్తుకొస్తారు, మన ప్రాణాలు కాపాడేది డాక్టరే అలాంటి వృత్తి డాక్టర్ వృత్తి అని అన్నారు. అలాంటి వృత్తి లో మా సామాజిక మిత్రుడు డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు కరోనా టైం లో సేవలు మరువలేము అని అన్నారు. మా యాదవుల్లో ప్రజా సేవ ముఖ్యమని భావించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు.బిజెపి నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ……. డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు, డాక్టర్ పిట్టి భారతి మరియు కుటుంబ సభ్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం చాలా సంతోషం, అభినందనీయం అని అన్నారు. ఈరోజు పక్క వ్యక్తులను గురించి పట్టించుకునే లేని పరిస్థితుల్లో ఇలా పేదలకు అందరికీ ఉచిత వైద్య చేయడం చాలా అభినందనీయం అని అన్నారు. డాక్టర్ని వైదో నారాయణ హరి, వైద్యుని దేవుడితో పోలుస్తాము, రోగులు బ్రతకాలని సేవ చేస్తారు అని అన్నారు .ఇలాంటి కార్యక్రమాలు ప్రతి డాక్టర్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పిట్టి మల్లికార్జునరావు ఇంకా పెద్ద హాస్పిటల్ పెట్టి ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.నగర కార్పొరేటర్ సత్య మాట్లాడుతూ…… గత 30 సంవత్సరాలు నుండి ప్రతి సంవత్సరం శ్రీ రత్నం హాస్పిటల్ నందు డాక్టర్ పిట్టి మల్లికార్జున రావు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు అని అన్నారు. ఈ సేవలో డాక్టర్ పిట్టి భారతి ,కుమారుడు డాక్టర్ వినాయక సందీప్ ,డాక్టర్ సాత్విక పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించినారు అని అన్నారు .ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి అయినా చేయడం చాలా అవసరం అని అన్నారు .డాక్టర్ అంటే దేవుడితో సమానం, దేవుడు తర్వాత ప్రాణాలు పోసేది డాక్టరే అని అన్నారు. అందరూ డాక్టర్ను గౌరవించండి, డాక్టర్ సేవలను తీసుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు