

- బహుజన సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమీక్ష సమావేశం…
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
బహుజన రాజ్యాధికారం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో బీఎస్పీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ విచ్చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గుణపర్తి అపురూప్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం ముఖ్య పాత్ర పోషించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల మండల కమిటీలు బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీఎస్పీ పార్టీ నుండి 100% ఎన్నికల బరిలో నిలవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షులు కొంగు రమేష్,నియోజకవర్గ ఉపాధ్యక్షులు మడికి శివ, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బత్తిన తాతాజీ , నియోజకవర్గ సెక్రెటరీ గుణపర్తి రాఘవ, ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.