

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు గోప్యంగా ఉంచారు. పాచిపెంట ఎస్సై కే వెంకట సురేష్ కధనం మేరకు మండల కేంద్రమైన పాచిపెంట గ్రామంలో గల బ్యాంకు ఆఫ్ బరోడా లో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఏటీఎంకు అమర్చిన సీసీ కెమెరాలు దొంగలించడమే కాకుండా ఏటీఎం మిషన్ కొద్ది భాగం ధ్వంసం చేయడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.బ్యాంక్ అఫ్ బరోడా జాయింట్ మేనేజర్ ఎల్ దేవి గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఏ గ్రామానికి చెందిన వాడనేది పూర్తి వివరాలను త్వరలో పత్రికా ముఖంగా తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారు.
