

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్…
శంఖవరం/ పిఠాపురం మన న్యూస్ ప్రతినిధి
సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాదిరిగా మిగతా ఔత్సాహికులు కూడా ప్రజాభివృద్ధి, సంక్షేమ సేవా కార్యక్రమాలను సొంత సొమ్ములతో స్వచ్ఛందంగా చేపట్టాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపును ఇచ్చారు. సాయిప్రియ సేవా సమితిని స్థాపించి జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొన్నేళ్ళుగా నిరవధికంగా జ్యోతుల శ్రీనివాసు చేపడుతూ ఉన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే ప్రతీ ఔత్సాహిక నాయకుడూ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జ్యోతుల శ్రీనివాసు మాదిరిగానే స్వచ్చందంగా నిర్వహించాలని మర్రెడ్డి శ్రీనివాస్ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడలో సాయిప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ యాజమాన్యం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మర్రెడ్డి శ్రీనివాస్ సభికులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్.డి.ఏ. ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పిఠాపురం నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని, ఔత్సాహికులు అందరూ పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సేవలో నిమగ్నం అవ్వాలని మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. సాయిప్రియ సేవా సమితి వ్యవస్దాపక అధ్యక్షులు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ… సాయిప్రియ సేవాసమితి గత 15 సంవత్సరాల నుండి దుర్గాడ గ్రామానికి అనేక సేవలను అందించిందని, ఈ సేవలు కొనసాగింపులో భాగంగానే ఈ రోజు ఈ ఉచిత కంటి శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం అన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా సాయిప్రియ సేవా సమితి సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధిపొంది సద్వినియోగం చేసుకోవాలని సభముఖంగా జ్యోతుల శ్రీనివాసు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వివర్స్ కార్పోరేషన్ డైరెక్టర్ బేతా సత్తిబాబు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శాఖ నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ కందా శ్రీను, వార్డు సభ్యులు గుండ్ర సీతారాం, సఖినాల రాంబాబు, గాది చందర్రావు, ఇంటి తమ్మాజీ, దేశిలంక నానాజీ, రావుల తాతారావు, మేడిబోయిన సత్యనారాయణ, జ్యొతుల వాసు, కాపారపు వెంకటరమణ, కొమ్మూరి కృష్ణ, గొల్లపల్లి గంగా ఈశ్వరుడు, వెలుగుల లక్ష్మణ్, ఉమ్మడి బోడకొండ, చేశెట్టి భద్రం, శాఖ సురేషు, కోలా శివ, కాపారపు వెంకట రమణ, రావుల రమణ, జ్యోతుల గొపి, మేడిబోయిన శ్రీను, స్టీఫెన్, ఉబా రమేష్, ఇప్పర్తి శ్రీను, పెదపాటి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.