ఖనిజాల అప్పగింత కోసం ఆదివాసీలపై అరాచకంబీజేపీ హయాంలో 14.50 లక్షల కోట్ల రుణ మాఫీలో లక్ష కోట్ల అవినీతి ఈవీఎం ట్యాంపరింగ్ల వల్లే బీజేపీ విజయం___2029లో కేంద్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం సిడబ్లుసి మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

కాకినాడ, ఆగస్ట్ 6 మన న్యూస్ :- : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వాటిని అరికట్టక పోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, సిడబ్ల్యూసి మాజీ సభ్యుడు చింతా మోహన్ విమర్శించారు. అలాగే చత్తీస్గడ్, అరకు ప్రాంతాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సంపద, ఖనిజాలను కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ఆదివాసీలను అనేక రకాలుగా హింసించి చంపుతోందని కొందరికి పురుషాంగాన్ని కూడా తొలగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని వారిలో ఉన్న ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళడం ఖాయమన్నారు. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని ఈ రుణమాఫీ వల్ల బీజేపీ పెద్దలకు లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. 2014, 2019, 2024లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంనకు వచ్చేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్లను చేసిందని చింతా మోహన్ చెప్పారు. బుధవారం చింతా మోహన్ కాకినాడలోని ఓ హోటల్లో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దళితులను విడగొట్టి వారితో ఆట్లాడుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయానని టీటీడీ దేవస్థానంలో దళిత ఉద్యోగులు, దళిత అధికారులను తొలగించడమే కాకుండా అందులో ఉన్న అంగళ్లలో దళితులకు దుకాణాల కేటాయించలేదన్నారు. అలాగే వర్గీకరణ పేరుతో దళితులను విడగొట్టి వారిలో వైష్యమ్యాలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు అతను సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి అనేది లేదని అక్కడ అరాచకం రాజ్యమేలుతోందని ఒక మహిళను చెట్టుకు కట్టిన పరిస్థితి చూస్తే అరాచక రాజ్యంగా కుప్పం తయారయిందన్నారు. హైదరాబాదును నేనే నిర్మించానని చెప్పుకున్న చంద్రబాబు కుప్పంకు ఏ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబు వల్ల కాదని అక్కడ ఉన్న పరిస్థితులు కారణమేగాక అభివృద్ధికి మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అవలంబించిన విధానాలు వల్లే హైదరాబాద్ జాతీ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో బ్యాంకింగ్ స్కాములు బాగా పెరిగిపోయాయని గడచిన 11 ఏళ్లలో 100 కోట్లు పైబడి బకాయి పడిన పారిశ్రామికవేత్తలకు 14.50 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ కోసం బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచుకున్న పేదల ఖాతాలపై పన్నువేసిందన్నారు. బీజేపీ తొలి నుండి ఈవీఎం ట్యాంపరింగ్లను చేసి గెలుస్తుందని ఈ విషయాన్ని తాను నిరూపించిన సంగతిని మోహన్ గుర్తు చేశారు. 2014లో సుమారు 114 సీట్లలో బీజేపీ ట్యాంపరింగ్ చేసి గెలిచినట్లుగా తాను చెప్పానన్నారు. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో వేలాది కోట్లు చేతులు మారాయని ఆ మద్యం ముడుపుల్లో ఉన్న ప్రతి ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రతి కొనుగోలుపై జిఎస్టి వసూలు చేసే ప్రభుత్వాలు మద్యం కొనుగోలుకు జగన్ ప్రభుత్వం నగదు తీసుకోవడం ఏమిటంటే మోహన్ ప్రశ్నించారు. మద్యం కుంభకోణంనకు గతంలో అవినీతికి పాల్పడిన జయలలిత, కేజ్రీవాల్, కవితలు జైలుకెల్లారని ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళడం ఖాయమన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు సంతోషంగా భూమి ఇవ్వలేదని వారిని బెదిరింపు చర్యలు చేసి భూములు సేకరించారన్నారు. రాజధానికి వెయ్యి ఎకరాలు సరిపోతుందని ఆయన చెప్పారు. రాజధాని ప్రాంతంలో కొద్దిగా గొయ్యి తవ్వితే నీరు వస్తుందని అందువల్ల రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలని సూచించారు. 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మోహన్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు ప్రజలకు ఓటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చింతా మోహన్ చెప్పారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *