కార్మికుల పక్షాన నిలబడే ఏకైక ట్రేడ్ యూనియన్ బి ఎం ఎస్ఏ రాజకీయ పార్టీకి బి ఎం ఎస్ అనుసంధానం కాదు…… మరో 6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వం చేస్తాం…భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్..
మన న్యూస్ తిరుపతి :– జిల్లాలో కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి, బలోపేతం చేయడమే భారతీయ మజ్దూర్ సాంగ్ లక్ష్యమని బి ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం గాంధీ రోడ్డు లోని ఏ జీకే బిల్డింగ్ లో ఆకుల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర కార్యదర్శి శీనప్ప చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం బి ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిఎంఎస్ రెండు కోట్ల 50 లక్షల సభ్యత్వం కలిగిన ట్రేడింగ్ అని చెప్పారు. ఎటువంటి రాజకీయ పార్టీలకు బి ఎం ఎస్ ట్రేడింగ్ యూనియన్ కు ఎలాంటి అనుసంధానం లేదని పేర్కొన్నారు. దేశంలో కోట్లాదిమంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద ట్రేడ్ యూనియన్ అని చెప్పారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న 5వేలకు పైగా యూనియన్లు బిఎంఎస్ గొడుగు కింద పని చేస్తున్నాయన్నారు. 1989లో అప్పటి కేంద్ర ప్రభుత్వమే దేశంలో కోట్లాది మందితో సభ్యత్వం కలిగిన ఏకైక ట్రేడ్ యూనియన్ బిఎమ్ఎస్ అని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. సంస్థలలో, కార్పొరేట్ కంపెనీలలో, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు యాజమాన్యం కు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమన్యాయంగా పనిచేసేదే బిఎంఎస్ అని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలలో భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోనే డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయన్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ లతోపాటు మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలలో కార్మికులకు అండగా నిలిచేది బి ఎం ఎస్ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రైల్వే, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ లతోపాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో బి ఎం ఎస్ కార్మికులే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. మరో6 నెలల్లో జిల్లాలో 1500 కు సభ్యత్వాన్ని పెంచుతాం… తిరుపతి జిల్లా అధ్యక్షులుగా తాను బాధ్యతలు చేపట్టిన నాటినుండి వచ్చే ఆరు నెలల్లోగా 1500 సభ్యత్వం చేసి తీరుతామని శపధం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 575 మంది మాత్రమే సభ్యులు ఉన్నారని, ఆ సంఖ్యను మూడు రెట్లు ఎక్కువ చేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేట్ సంస్థలతో పాటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులను కలసి యూనియన్ నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా ఎలాంటి రాజకీయ పార్టీలకు అనుసంధానంగా లేకుండా పనిచేసే ఏకైక కార్మిక యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఒకటేనని ఆకుల సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఆకుల సతీష్ కుమార్ ను జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సన్నిహితులు స్నేహితులు శుభాకాంక్షలతో ముంచేత్తారు. నూతన కార్యవర్గం ఇదే… జిల్లా అధ్యక్షులు.. ఆకుల సతీష్ కుమార్ ,ఉపాధ్యక్షులు.. జే. జయప్రకాష్ ( శ్రీహరికోట ), శివ శంకరయ్య ( టీటీడీ),
వెంకట్ రాజు ( రైల్వే). జిల్లా కార్యదర్శిగా… చంద్రకాంత్ ( రైల్వే). సంయుక్త కార్య దర్శులుగా… వెంకటాద్రి యాదవ్, కుమార్ ( శ్రీకాళహస్తి). సంస్థాగత కార్యదర్శిగా… స్వర్ణలత (స్విమ్స్, తిరుపతి). కోశాధికారిగా… రవికుమార్. కార్యాలయ కార్యదర్శిగా.. ఉమేష్ లను నియమించారు.
