కాకినాడ, ఆగస్ట్ మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీలు ఇచ్చిన విధంగా రజకులకు రక్షణ చట్టం, కార్పొరేషన్ ద్వారా రుణాలు, 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను, ఖాళీగా ఉన్న ధోబి పోస్టులు భర్తీ చేయాలని, వృత్తి చేసుకొనే రజకుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి హామీ ఇచ్చిందని వీటిని తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప వద్ద ఇటీవల మృతి చెందిన రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కొజ్జవరపు మాణిక్యం సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన భాస్కరయ్యతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వృత్తిదారుల సంఘాల కన్వీనర్ ఎం రాజశేఖర్ ప్రసంగించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాణిక్యం సమావేశాలు, సభలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. గత చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణల ఆశయ సాధనతో రజకుల హక్కులు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నెల్లూరులో జరగనున్న శిక్షణ తరగతులకు మాణిక్యం పేరు పెడదామని అలాగే పశ్చిమగోదావరిలో జరిగే సమావేశాల్లో సంతాపం తీర్మానం చేస్తామన్నారు. మాణిక్య మృతి వృత్తిదారుల సంఘంనకు చాలా తీరని లోటని భాస్కరయ్య, రాజశేఖర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి కోనేటి రాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి మడక రాజులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఫోటోకు నివాళులర్పించి సంతాప వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాకలపాటి సోమరాజు, కొజ్జవరకు సత్యనారాయణ, పోలిపల్లి చిన్న శ్రీను, కనకరాజు, ఏవిడి మెంటారావు, చెల్లూరి లోవ, మాణిక్యం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *