

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, గూడూరును జిల్లాగా చేయాలని క్రీడాకారులు, వాకర్స్ ర్యాలీగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెవివి అధ్యక్షుడు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో బాగంగా ప్రచారానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాలకృష్ణ గూడూరు ను నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. వారు చెప్పినటువంటి అన్ని పథకాలు అమలు పరుస్తూ ఉన్నారు అదేవిధంగా వారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు ను నెల్లూరులో జిల్లాలో కలపాలని కోరుచున్నాము. శాసనసభలో మన ఎమ్మెల్యే గూడూరు ను నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించటం మనమందరం చూసాము… ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లయితే గూడూరు ను జిల్లా చేసినట్లయితే గూడూరులో ప్రధానంగా రైల్వే డివిజన్, రెవెన్యూ డివిజన్, నిమ్మకాయల వ్యాపారం ఉన్నాయి.. చిల్లకూరు మండలం పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది.. ఈ విధంగా గూడూరు ను జిల్లా కేంద్రంగా చేసినట్లయితే అన్ని వనరులు గూడూరులో ఉన్నందున గూడూరు జిల్లాగా చేయమని గూడూరు ఎమ్మెల్యే ద్వారా కోరుచున్నాము. గూడూరు నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజలు తిరుపతికి వంద కిలోమీటర్లు పైగా వెళ్లి వారి యొక్క సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవటానికి ఒకరోజు గడచిపోతుంది, ఆర్థికంగా నష్టం జరుగుతుంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కావున గతంలో ఉన్నట్లుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరులో గూడూరును కలిపినట్లయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది.. కావున చంద్రబాబునాయుడు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసే పని అయితే గూడూరు జిల్లాగా చేసి గూడూరు సర్వేపల్లి నాయుడుపేట వెంకటగిరి కలిపి జిల్లాగా చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.. కావున ఎమ్మెల్యే చొరవ తీసుకొని గూడూరు ను జిల్లా చేయుటకు ముఖ్యమంత్రి తో, లోకేష్ తో మాట్లాడి గూడూరును జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, పీవీకే శర్మ, సుమన్ రెడ్డి, కోటేశ్వరరావు, మస్తాన్, సాయి, మునీఫ్, శశిధర్, మొబైల్ రాజా, ప్రసాద్, చిన్నారావు, రజనీకాంత్, హగ్గయ్య, సందీప్, ఇమ్రాన్ ఇతర క్రీడాకారులు వాకర్స్ పాల్గొన్నారు.
