

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 19వ రోజు లో భాగంగా
గూడలి పంచాయతీ – చంద్రశేఖర పురం నందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్. మాట్లాడుతూ పంచాయతీ నందు 755 పెన్షన్లు అందిస్తున్నాం , తల్లికి వందనం కింద 656 మందికి 85 లక్షల 28 వేలు అందించాం. అన్నదాత సుఖీభవ కింద 278 మందికి గాను 19 లక్షల 46 వేలు అందించాము. వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా మహిళా గ్రూప్ సభ్యులకు 20 లక్షల రూపాయల చెక్కు ను అందించాము అని అన్నారు. గత ప్రభుత్వం లాగ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఎలెక్షన్ ప్రచారం లో చెప్పిన విధముగా అన్ని అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.
