
జన బాణం,నెల్లూరు, ఆగస్టు 5:మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని నెల్లూరు జిల్లా, వెంకటాచల మండలం ,తిక్కవరపాడు గ్రామస్తులు మరియు బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తిక్కవరపాడు గ్రామంలోని సర్వే నంబర్ 2120-2,5,9 లలో 7 ఎకరాల 68 సెంట్ల విస్తీర్ణంకుగాను…. మాకు మా తండ్రి తమలపాకుల మస్తానయ్య నుండి వారసత్వంగా 3 ఎకరాల 48 చెట్ల వ్యవసాయ భూమి సంక్రమించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో మా పొలానికి చుట్టుపక్కల ఉన్న అగ్రవర్ణస్తులు (కమ్మ కులస్తులు) ఉద్దేశపూర్వకంగానే మాది పట్టా పొలం అయినప్పటికీ, అధికార ,అంగ బలముతో ఈనెల 2 ,3 తేదీలలో శని, ఆదివారాలలో 2 రోజులుగా జెసిబి యంత్రం మరియు ట్రాక్టర్లతో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగించారని తెలిపారు. ఈ అక్రమ రోడ్డు నిర్మాణం స్థానిక టిడిపి నాయకులు కమ్మ వర్గస్తులైన బోయపాటి వెంకటేశ్వర్లు, కొమ్మి సుబ్బారావు, కందిమల్ల వెంకటేశ్వర్ల నాయుడు, కందిమల్ల మధు నాయుడు, గొట్టిపాటి రవీంద్ర, లింగం కుంట యానాదయ్య, బెల్లంకొండ వెంకయ్య తదితర అగ్రవర్ణస్తులు చేపట్టగా, వారికి అధికార అండగా వెంకటాచలం మండల రెవిన్యూ మరియు పోలీస్ అండగా నిలిచి, దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేశారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మేము పొలం దగ్గరికి వెళ్లి ఉన్నట్లయితే మా ముగ్గురు అన్నదమ్ములతోపాటు మా కుటుంబ సభ్యులను కూడా చంపేందుకు కుట్ర పన్నారని, ఈ విషయం తెలిసి మేము మా ఇళ్ళ నుండి బయటకు కూడా పోలేదని బోరున విలపించారు. రోడ్డు అక్రమ నిర్మాణం చేపట్టే విషయమై ఆగస్టు 1న శుక్రవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో తలారి ద్వారా మాకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ మేము అధికారులకు చెప్పేందుకుగాను, మా పొలంలోకి వెళ్లి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు కూడా భయపడి పోలేకపోయామని తెలిపారు. మాకు హక్కుగా కలిగి ఉన్న పట్టాకు సంబంధించి రెవెన్యూ రికార్డు లోను, గ్రామకంఠంలోనూ కాలిబాటుగా ఉన్న స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అధికారులు, హైకోర్టు స్టే , రెవెన్యూ కోర్టు ఆర్డర్ లను ధిక్కరించి మా పట్టా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితులు తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో బాధితులుతమలపాకులఏడుకొండలు,తమలపాకుల వెంకటేశ్వర్లు,తమలపాకుల రామయ్య , తమలపాకుల పద్మమ్మ, తమలపాకుల శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
