

మన న్యూస్, తిరుపతి: రాష్ట్రంలో హస్త కళాకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు హస్త కళలను అభివృద్ధి చేసేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. సోమవారం అంగళ్లు వద్ద ఎర్రకోట హస్తకళ వస్తువుల ఉత్పత్తిదారులతో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ లతో కలిసి టే ర్రకోట హస్తకళ వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జాతీయ రహదారి పై స్థలాన్ని హస్తకళాకారుల కేటాయించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. స్థలాన్ని కేటాయించి అక్కడ రూములు నిర్మించి హస్తకళాకారులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా దృష్టి సారిస్తామన్నారు. స్థానిక తాసిల్దార్ ఎండిఓ సంబంధిత అధికారులు వెంటనే స్థల పరిశీలన చేయాలని, కావలసిన నిధుల ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. అంతకుముందు తట్టివారి పల్లి బైపాస్ వెంగమాంబ సర్కిల్ వద్ద జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దారం అనిత దారం హరిప్రసాద్ పుప్పాల శంకర్ దాకరాజు భరణి అశ్వత్ వెంకటేష్ అరవింద్ జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.
