

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
అంగన్వాడి కేంద్రాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.దుత్తలూరు మండలం రెడ్ల దిన్నె కాలనీ అంగన్వాడి స్కూల్ నందు టీచర్ జయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమేఅని తెలియజేయడం ఈ కార్యక్రమం యెక్క ముఖ్య ఉద్దేశం. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు తాగించకూడదని తెలిపారు.బిడ్డ పుట్టిన గంటలోనే తల్లి యొక్క పసుపు రంగు చక్కటి పాలు (ముర్రుపాలు)మంచిదని చెప్పారు. వీటి ద్వారా బిడ్డకి అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని తెలిపారు. తల్లిపాలు బిడ్డ శరీరానికి మెదడు కూడా తల్లిపాలలో ఉన్న పోషక గుణాలు మరియు ఇతర పాలల్లో ఉండవని స్పష్టం చేశారు.మరి ముఖ్యంగా తల్లి పాలు శిశువునికి నిమోనియా,అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని ఆమె చెప్పారు.అదే విధంగా అంగన్వాడీ స్కూల్ లలో ప్రభుత్వం అందుస్తున్న పోషక పదర్దాలు తల్లులు కు మరియు పిల్లలు కు ఎంతో మంచిది అని ఆమె తెలియజేసారు. ప్రతి గర్భిణీ లకు చిన్న పిల్లలు కు అంగన్వాడీలో ఇస్తున్నటువంటి సరుకులన్నీ కూడా చాలా మంచిదని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడి టీచర్లు జయమ్మ, అన్నపూర్ణ, విజయలక్ష్మి, సరస్వతి, ప్రమీల, సుభాషిని, ప్రభావతి, పార్వతి(ఏ ఎన్ ఎమ్ ) భవాని, కవిత,మహిళా పోలీస్ మాధురి, కుమారి, చిన్న పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.