

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు)::
కలిగిరి మండలం పోలంపాడు గ్రామానికి ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులు బొల్లినేని రామానాయుడు సుబ్బమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించిన, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని రిబ్బన్ కటింగ్ చేసి గురువారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని సీతాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలంపాడు గ్రామంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ప్రజా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. కనుక తెలుగుదేశం పార్టీకి అందరూ అండగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావుల కొల్లు సర్పంచ్ పీవీ నాయుడు,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, సర్పంచ్ కల్లూరు రేష్మ, కల్లూరు చంద్రమౌళి, నల్లపనేని సురేష్,259 బూత్ ఇంచార్జి నేల పార్టీ మజ్ను,, కల్లూరు మహేంద్ర, ఎంపీటీసీ సభ్యురాలు ఇండ్ల చెంచమ్మ, సుబ్బారెడ్డి, పెద్ద కొండూరు మాజీ సర్పంచ్ మొక్క హాజరత్ రావు, మండలం మరియు గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.