

వింజమూరు,(మననన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న కోవి బసవేశ్వర రావు నాగలక్ష్మి, కోవి రవి శంకర్ చౌదరి మాధవి దంపతులు..!వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, 10 కోట్ల రూపాయలతో, కళ్యాణ మండపం నిర్మాణం..!
వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో, దివంగత కోవి సుబ్బారావు, సామ్రాజ్యం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కోవి బసవేశ్వర రావు, నాగలక్ష్మి, కోవి రవిశంకర్ మాధవి దంపతులచే 10 కోట్ల రూపాయలతో నిర్మించిన, కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఊటుకూరుకు గ్రామానికి చెందిన వీరు గత 30 సంవత్సరాల క్రితం, వలస వెళ్లారు. అనేక కష్టనష్టాలను ఎదుర్కొని, స్థిర పడ్డారు. తల్లిదండ్రుల పై ఉన్న ప్రేమతో పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు, ఆ గ్రామంలోనే 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి, విశాలంగా, విలాసవంతంగా, అత్యంత సుందరంగా, జిల్లా స్థాయిలో ఉండే కళ్యాణమండపాలకు పోటీపడే విధంగా తీర్చిదిద్ది, కళ్యాణ మండపాన్ని నిర్మించారు. కె ఎస్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం లో బుధవారం రాత్రి పాలు పొంగించగా, గురువారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కళ్యాణ మండపానికి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ కార్యక్రమానికి చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాదినేని నరేంద్ర, గోరంట్ల మాల్యాద్రి, అంచూరి శ్రీనివాసులు, మందాడి కొండయ్య, మాదినేని నాగార్జున, తదితరులు ఉన్నారు.