

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న “పిల్లిగుండ్ల కాలనీ” ప్రాంతంలో “జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” యొక్క అధ్యాపకులు విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి విద్యా హక్కు చట్టం యొక్క నియమ నిబంధనలకు తూట్ల పొడుస్తున్న సెంటర్ యాజమాన్యం పూర్తి వివరాలలోకి వెళితే పిల్లిగుండ్ల కాలనీ లో కర్నూల్ ప్రాంతవాసి అయినా విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి ఈ కాలనీ లో ఒక రెండు అంతస్థులు కలిగిన నిర్మాణం లో ఉన్న భవనం ను అద్దెకు తీసుకొని అక్కడ నే “జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్ ” పేరుతో కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు ఈ వ్యక్తి విద్యార్థులచేత భవనం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం. అలాగే రాళ్లు మొయించడం. మట్టి పని చేయించడం లాంటి వెట్టిచాకిరీ పనులు చేయించడం జరుగుతుంది వేయిలకు వేయిల రూపాయలు కోచింగ్ ఫీజులు తీసుకొని గురుకుల. నవోదయ. రెసిడెన్సీయల్ పాఠశాలల ప్రవేశాలకు సంబందించినబోధన చేయకుండా ఇలా వెట్టి చాకిరీ పనులు చేయిస్తున్నారు అలాగే విద్యార్థులకు సరియైన వసతులు లేకుండా. అన్ని గదులు ఓపెన్ గా ఉన్న గదులలో వర్షానికి తడుస్తూ. చలిగాలికి ఉంటూ ఇక్కడ కోచింగ్ సెంటర్ లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు మరుగుదొడ్లు కూడ మగపిల్లలకు. ఆడపిల్లలకు కలిపి ఒక్కే మరుగుదొడ్డి. ఒకే స్నానపు గది కలిగియుండడం ఆశ్చర్యం నకు గురిచేస్తుంది ఈ విషయం ను పలుమార్లు సంబంధిత మండల. జిల్లా విద్యాధికారుల ద్రుష్టి కి. పాత్రికేయులు. ప్రజలు తీసుకొనిపోయినా ఎలాంటి ప్రయోజనం లేకపోలేదు గతం లో MEO సురేష్ అనే అధికారి ప్రైవేట్ పాఠశాలలా యాజమాన్యం తోను. గురుకుల కోచింగ్ సెంటర్ యాజమాన్యంతోను అక్రమంగా డబ్బులు తీసుకొని నిర్లక్ష్యం చేస్తూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి కాబ్బట్టి జిల్లా విద్యాధికారులు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అక్రమ అనుమతులు లేని పాఠశాలలపై. గురుకుల కోచింగ్ సెంటర్ లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
