

గూడూరు, మన న్యూస్ :- వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు రాజంపేట ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం 4:00 గంటలకి జగనన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అయిన ఊటుకూరు మహేందర్ రెడ్డి మరియు ఆయన సతీమణి గూడూరు రూరల్ జడ్పిటిసి అయిన ఊటుకూరి యామిని నెల్లటూరు లోని వారి నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారి దంపతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంక్షేమ పథకాలు అమలు మరిచిందని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చాలా సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నారని వాళ్లపైన ఎలాంటి మచ్చ లేదని ఇప్పుడు కేవలం రాజకీయ కక్ష తీర్చుకోవడంలో భాగంగా మిథున్ రెడ్డిని గారిని అరెస్ట్ చేయడం మరింత హేయంగా ఉందని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా మీరిచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను చక్కగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి ఘటనలు మంచిది కాదని ఇప్పుడు మనం ఏం చేస్తే అవే మళ్ళీ మనకు తిరిగి వస్తాయని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి దంపతులతో పాటు మెడ నూలు రవీంద్రరెడ్డి పాలెపు గోపాలయ్య పెరికల సీనయ్య నన్నూరు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.