పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశం

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్అ ధికారులతో జిల్లా ఎస్పి టీ శ్రీనివాస రావు గురువారం నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్పీ.. పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో నమోదు అయిన కేసులు, యూఐ లో ఉన్న కేసులను పరిశీలించారు. అందుకు సంబంధించి కేసు దర్యాఫ్తు లో పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అంశాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా విచారణ చేపట్టి కోర్టులలో చార్జీ షీట్ వేసి త్వరగ సీసి (కోర్టు క్యాలండర్) నెంబర్ లు పొందాలని సూచించారు. ఆయా కేసులలో నిందితులకు శిక్ష పడేందుకు కృషి చెయ్యాలని, మనోపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో 6 గురికి జైలు శిక్ష పడినందున అందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణకు పకడ్బందీ గా చర్యలు చేపట్టాలని , సరి హద్దు రాష్ట్రాలలో ప్రాపర్టీ నేరాల గ్యాంగ్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ దిశ గా కేసుల చేదన పై దృష్టి పెట్టాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లకు కొత్త సిబ్బంది వస్తున్నందున బీట్ గస్తీ ల సంఖ్య పెంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ నేరాలు జరుగకుండ పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రాపర్టీ సంబంధిత కేసులలో ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించాలని అన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ లో CC కెమెరాలు ఉండాలనీ , పని చెయ్యని వాటిని పునరుద్ధరించాలని సూచించారు. నమోదు అయిన కేసులలో నిందితుల అరెస్ట్ పెండింగ్ లేకుండా చూడాలనీ ,యూఐ కేసులలో పారదర్శకంగా విచారణ చేపట్టి కోర్టు లో చార్జి షీట్ వెయ్యాలని సూచించారు.
జిల్లా లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల వివరాలు పరిశీలించారు. ఇట్ అండ్ రన్ కేసులలో మిగిలిన కేసులలో ట్రెస్ ఔట్ కానీ వాహనాలను గుర్తించి కేసులను చేదించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడితో గౌరవం తో మెలిగేలా రిసెప్షన్ సిబ్బంది కి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని, కోర్టు అధికారులతో రోజు మాట్లాడుతూ కోర్టు లో సంబంధిత కేసుల వివరాలు అప్డేట్ అవుతూ ఉండాలనీ సూచించారు. ఈ నెల 30 వ తేదిన మహబూబ్ నగర్ లో జరిగే రైతు అవగాహాన సభకు పోలీస్ బందోబస్తుకు సంబందించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్ టిసెక్షన్ లో వెహికల్ మెంటనెన్స్, డ్రైవింగ్ లో మంచి ప్రతిభ కనబరచిన ధరూర్ వెహికల్ డ్రైవర్ జగన్,ఆలంపూర్ సర్కిల్ ఆఫీస్ డ్రైవర్ రవీందర్ రెడ్డి లకు క్యాష్ రివార్డ్ అందజేశారు. జిల్లా లో అత్యాధునిక డ్రోన్ కెమెరా వ్యవస్థ తో పోలీస్ నిఘా జిల్లా లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానo తో కూడిన డ్రోన్ కెమెరా వ్యవస్థ ద్వారా పోలీస్ నిఘా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రాపర్టీ నేరాలు జరుగకుండా నిఘా ఉంచడం, అక్రమ రవాణా,బహిరంగ ప్రదేశాలలో మధ్యం సేవించే వారి పై నిఘా ఉంచడం మరియు భారి బహిరంగ సభలు, జాతరలు, ట్రాపిక్,పోలీస్ బందోబస్తు, నిమజ్జనం ను పర్యవేక్షించడం కోసం డ్రోన్ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ, అందుకు సంబంధించి ప్రత్యేక సిబ్బందిని నియమించడం తో పాటు తగిన ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందనీ అన్నారు. పగలు, రాత్రి సమయాలలో కూడా ఏ ప్రదేశాన్ని అయిన 5 కిలోమీటర్ల రీడియస్ వరకు, నేరుగా అయితే 15 కిలోమీటర్ల వరకు క్లియర్ గా చూపించగలుగుతుందని, ఇతర సీసీ కెమెరాల మాదిరి కేసులలో ఎవిడెన్స్ కు ఉపయోగపడే విధంగా డ్రోన్ వ్యవస్థ ను ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ అన్నారు. అందుకు సంబంధించిన డ్రోన్ వ్యవస్థ పనీ తీరును జిల్లా ఎస్పీ పోలీస్అ ధికారులతో కలసీ పరిశీలించారు. ఈ సమవేశం లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె.గుణ శేఖర్, డి. ఎస్పీ సత్యనారాయణ , ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆలంపూర్, గద్వాల, శాంతి నగర్ సీఐ లు రవి బాబు, శ్రీనివాస్ , టాటా బాబు, ఆర్ ఐ వెంకటేష్, డీసీ ఆర్బీఎస్సై రజిత ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..