

(మన న్యూస్ ):
బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దామని ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బాల వివాహ్ ముక్త్ భారత్’కు మద్దతుగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ‘బాల్య వివాహ రహిత భారతదేశం’ కార్యక్రమానికి మద్దతుగా తిరుపతిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం సహకరిస్తే బాల్య వివాహాలు చాలా వరకు అరికట్టవచ్చని కేవీ రమణ అభిప్రాయపడ్డారు. ‘బాల్య వివాహ రహిత భారతదేశం’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం హర్షణీయమన్నారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో ప్రగతి సంస్థ ప్రదర్శనలు, ప్రతిజ్ఞ చేపడుతోందన్నారు. ఇందుకు అధికారులు సహకరించాలని కేవీ రమణ విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలల హక్కుల రక్షణ కోసం దేశ వ్యాప్తంగా 400కి పైగా జిల్లాల్లో 250కి పైగా స్వచ్చంధ సంస్థలు పని చేస్తున్నాయని… ఇందులో ప్రగతి సంస్థ ఒక్కటని కేవీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు తాము చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఉపాధ్యాయులు, అంగన్ వాడీలు,ఆశా వర్కర్లు, ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరుకున్నారు. ముఖ్యంగా ఇందుకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల సహకారం చాలా అవసరమని కేవీ రమణ అభిప్రాయపడ్డారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కోసం క్షేత్ర స్థాయిలో ప్రచారం చాలా ముఖ్యమన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయాలన్నారు. బాల్య వివాహాల గురించి సులభంగా తెలియజేయడానికి ఒక జాతీయ పోర్టల్ ను కూడా ప్రభుత్వం ఆవిష్కరించిందని ఈ సందర్భంగా కేవీ రమణ గుర్తు చేశారు. ఇక బాల్య వివాహాలకు పేదరికం ప్రధాన కారణమన్నారు. బాల్య వివాహాల సూచిలో దక్షిణ భారతదేశంలో ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 23.3శాతం బాల్య విహహాలు జరుగుతున్నాయని కేవీ రమణ గుర్తు చేశారు. తిరుపతి జల్లాలో బాల్య వివాహాల శాతం 29గా ఉందన్నారు. 2030నాటికి బాల్య వివాహాల రహిత భారత్ ను చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయమన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో కొన్ని కులాలకు సంబంధించిన వారు బాల్య వివాహాలు చేయడం ఆచారంగా వస్తోందని కేవీ రమణ చెప్పారు. బాల్య వివాహాల సంఖ్య తగ్గిస్తున్నామే కానీ… పూర్తిగా నిర్మూలించ లేక పోతున్నామన్నారు. స్వచ్చంథ సంస్థలు, అధికార యంత్రాంగం కలసి పని చేస్తే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… బాలక్య వివాహాల నిర్మూలన అనేది ఒక మహత్తర కార్యం అన్నారు. చైతన్యంతోనే ఈ బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమన్నారు. బాలికలకు వివాహ వయసు 21కి పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. యువత చెడు మార్గంలో పయనించడం వలన సమాజానికి చేటు జరుగుతోందన్నారు. బాల్య వివాహాల విషయంలో బాలికలు బలి అవుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక అడిషనల్ డీఎం అండ్ హెచ్ వో శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… బాల్య వివాహాల వలన బాలింతలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లాలో తడ, నాయుడుపేట, గూడూరు, యర్రావారిపాళెం మండలాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం బాల్య వివాహాలకు ప్రధాన కారణమన్నారు. బాల్య వివాహాల వలన శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడి భావి సమాజానికి హాని జరుగుతుందన్నారు. గిరిజనుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని నివారించడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. భావి సమాజం కోసం ఆడపిల్లలను కాపాడు కోవాలని శ్రీనివాసులురెడ్డి సూచించారు. ఇక నోడల్ ఆఫీసరు వాసంతి మాట్లాడుతూ… బాల్య వివాహం సాంఘిక దురాచారమని… ఈ దురాచారం రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ వివాహాలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ కులాల్లో జరుగుతున్నాయని… వీటి వలన జరిగే అనర్థాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇక మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు రవీంద్ర మాట్లాడుతూ…దేశంలో 23శాతం పైగా బాల్య వివాహాలు ఇంకా జరుగుతుండటం బాధాకరమన్నారు. వీటికి మూల కారణం అన్వేషించాలన్నారు. పేదరికం, ఆర్థిక స్థితి, అవిద్య కారణంగా ఈ దురాచారం ఇంకా కొనసాగుతోందని రవీంద్ర అభిప్రాయ పడ్డారు. ఈ దురాచారం నిర్మూలించాలంటే సమిష్టి కృషి అవసరం అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు మెప్మా తనవంతు సహకారం అందిస్తుందన్నారు. ఇక డీఆర్ డీఏ ప్రాజెక్టు డైరెక్టరు శోభన్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఇప్పటికీ 29శాతం బాల్య వివాహాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. 1920లోనే బ్రిటీషు ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలన చట్టం అమల్లోకి తెచ్చిందన్నారు. 2003 నుంచి రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టం పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. అయినా బాల్య వివాహాలు కొన్ని తెగల్లో జరుగుతూనే ఉన్నాయన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాల్య వివాహాలపై తాను ప్రత్యేకంగా పని చేశానని శోభన్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు డీఆర్ డీఏ తనవంతు సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టరు జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టరు చెన్నయ్య, విన్స్ సంస్థ డైరెక్టరు మీరా, ఎస్ఎస్ఏ అధికారి శ్రీధర్, న్యాయవాది సుబ్రహ్మణ్యం, మహిళా పోలీసు స్టేషన్ కానిస్టుల్ మునిరాజా, ఐసీడీఎస్ అధికారులు, అంగన్ వాడీ కార్యకర్తలు, ప్రగతి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన న్యూస్: తిరుపతి, బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దామని ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బాల వివాహ్ ముక్త్ భారత్’కు మద్దతుగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ‘బాల్య వివాహ రహిత భారతదేశం’ కార్యక్రమానికి మద్దతుగా తిరుపతిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం సహకరిస్తే బాల్య వివాహాలు చాలా వరకు అరికట్టవచ్చని కేవీ రమణ అభిప్రాయపడ్డారు. ‘బాల్య వివాహ రహిత భారతదేశం’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం హర్షణీయమన్నారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో ప్రగతి సంస్థ ప్రదర్శనలు, ప్రతిజ్ఞ చేపడుతోందన్నారు. ఇందుకు అధికారులు సహకరించాలని కేవీ రమణ విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలల హక్కుల రక్షణ కోసం దేశ వ్యాప్తంగా 400కి పైగా జిల్లాల్లో 250కి పైగా స్వచ్చంధ సంస్థలు పని చేస్తున్నాయని… ఇందులో ప్రగతి సంస్థ ఒక్కటని కేవీ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు తాము చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఉపాధ్యాయులు, అంగన్ వాడీలు,ఆశా వర్కర్లు, ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరుకున్నారు. ముఖ్యంగా ఇందుకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల సహకారం చాలా అవసరమని కేవీ రమణ అభిప్రాయపడ్డారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కోసం క్షేత్ర స్థాయిలో ప్రచారం చాలా ముఖ్యమన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ప్రతిజ్ఞ చేయాలన్నారు. బాల్య వివాహాల గురించి సులభంగా తెలియజేయడానికి ఒక జాతీయ పోర్టల్ ను కూడా ప్రభుత్వం ఆవిష్కరించిందని ఈ సందర్భంగా కేవీ రమణ గుర్తు చేశారు. ఇక బాల్య వివాహాలకు పేదరికం ప్రధాన కారణమన్నారు. బాల్య వివాహాల సూచిలో దక్షిణ భారతదేశంలో ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 23.3శాతం బాల్య విహహాలు జరుగుతున్నాయని కేవీ రమణ గుర్తు చేశారు. తిరుపతి జల్లాలో బాల్య వివాహాల శాతం 29గా ఉందన్నారు. 2030నాటికి బాల్య వివాహాల రహిత భారత్ ను చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయమన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో కొన్ని కులాలకు సంబంధించిన వారు బాల్య వివాహాలు చేయడం ఆచారంగా వస్తోందని కేవీ రమణ చెప్పారు. బాల్య వివాహాల సంఖ్య తగ్గిస్తున్నామే కానీ… పూర్తిగా నిర్మూలించ లేక పోతున్నామన్నారు. స్వచ్చంథ సంస్థలు, అధికార యంత్రాంగం కలసి పని చేస్తే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… బాలక్య వివాహాల నిర్మూలన అనేది ఒక మహత్తర కార్యం అన్నారు. చైతన్యంతోనే ఈ బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమన్నారు. బాలికలకు వివాహ వయసు 21కి పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. యువత చెడు మార్గంలో పయనించడం వలన సమాజానికి చేటు జరుగుతోందన్నారు. బాల్య వివాహాల విషయంలో బాలికలు బలి అవుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక అడిషనల్ డీఎం అండ్ హెచ్ వో శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ… బాల్య వివాహాల వలన బాలింతలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లాలో తడ, నాయుడుపేట, గూడూరు, యర్రావారిపాళెం మండలాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. నిరక్షరాస్యత, పేదరికం బాల్య వివాహాలకు ప్రధాన కారణమన్నారు. బాల్య వివాహాల వలన శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడి భావి సమాజానికి హాని జరుగుతుందన్నారు. గిరిజనుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని నివారించడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. భావి సమాజం కోసం ఆడపిల్లలను కాపాడు కోవాలని శ్రీనివాసులురెడ్డి సూచించారు. ఇక నోడల్ ఆఫీసరు వాసంతి మాట్లాడుతూ… బాల్య వివాహం సాంఘిక దురాచారమని… ఈ దురాచారం రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ వివాహాలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ కులాల్లో జరుగుతున్నాయని… వీటి వలన జరిగే అనర్థాలపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇక మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు రవీంద్ర మాట్లాడుతూ…దేశంలో 23శాతం పైగా బాల్య వివాహాలు ఇంకా జరుగుతుండటం బాధాకరమన్నారు. వీటికి మూల కారణం అన్వేషించాలన్నారు. పేదరికం, ఆర్థిక స్థితి, అవిద్య కారణంగా ఈ దురాచారం ఇంకా కొనసాగుతోందని రవీంద్ర అభిప్రాయ పడ్డారు. ఈ దురాచారం నిర్మూలించాలంటే సమిష్టి కృషి అవసరం అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు మెప్మా తనవంతు సహకారం అందిస్తుందన్నారు. ఇక డీఆర్ డీఏ ప్రాజెక్టు డైరెక్టరు శోభన్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఇప్పటికీ 29శాతం బాల్య వివాహాలు జరుగుతుండటం బాధాకరమన్నారు. 1920లోనే బ్రిటీషు ప్రభుత్వం బాల్య వివాహాల నిర్మూలన చట్టం అమల్లోకి తెచ్చిందన్నారు. 2003 నుంచి రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టం పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. అయినా బాల్య వివాహాలు కొన్ని తెగల్లో జరుగుతూనే ఉన్నాయన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాల్య వివాహాలపై తాను ప్రత్యేకంగా పని చేశానని శోభన్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు డీఆర్ డీఏ తనవంతు సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టరు జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టరు చెన్నయ్య, విన్స్ సంస్థ డైరెక్టరు మీరా, ఎస్ఎస్ఏ అధికారి శ్రీధర్, న్యాయవాది సుబ్రహ్మణ్యం, మహిళా పోలీసు స్టేషన్ కానిస్టుల్ మునిరాజా, ఐసీడీఎస్ అధికారులు, అంగన్ వాడీ కార్యకర్తలు, ప్రగతి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.