శంఖవరం లో 21 నుండి రిలే నిరాహారదీక్ష…

  • 25 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు సన్నద్దం
  • మైనింగు రవాణాకు ప్రత్యేక రోడ్డు వేసుకోవాల్సిందే…
  • మేకల కృష్ణ డిమాండ్…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి


కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై పరిమితికి మించిన బరువుతో నిర్లక్ష్యంగా, అక్రమంగా నిత్యం ప్రమాద భరితంగా రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల వందలాది లారీల మాఫియా ఆగడాలను నియంత్రించని ప్రభుత్వ యంత్రాంగాల విధానాల మార్పు కోరుతూ ఈ జూలై 21 నుండి రిలే నిరాహారదీక్ష చేపట్ట నున్నట్టు జిల్లా టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు, శంఖవరం గ్రామ సామాజిక సేవాకర్త, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మేకల కృష్ణ ప్రకటించారు. 21 నుండి 24 తేది వరకు ఉదయం 9, సాయంత్రం 4 గంటల మధ్య రిలే నిరాహార దీక్ష చేయడానికి మానసికంగా, శారీరకంగా, చట్టబద్దంగా తాను సన్నద్దుడను అయ్యాయని తన కడపటి షరతు(అల్టిమేటం)ను ఆయన ప్రకటించారు. ఈ మేరకు శంఖవరంలోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తన ఉద్యమ పూర్తి వివరాలను వెల్లడించారు. 21వ తేది సోమవారం ఉదయం 9 గంటలకు శంఖవరం సిబ్బంది వీధి రామాలయం వద్ద తన రిలే నిరహార దీక్షను ప్రారంభించి 24 తేది సాయంత్రం 4 గంటల వరకూ తన రిలే నిరాహారదీక్షలను కొనసాగించ నున్నట్లు ఆయన వెల్లడించారు.‌ రాజ్యాంగబద్ద హక్కుగా భావించి తాను ప్రభుత్వాన్ని అడిగిన పరిష్కారాన్ని అప్పటికీ కూడా ప్రభుత్వం చూపకపోతే 25 తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్ష (హంగర్ స్ట్రైక్) చేపడతానని మేకల కృష్ణ ప్రకటించారు.

ప్రభుత్వ, ప్రజా రవాణ సౌకర్యార్ధం రోడ్లు, భవనాల శాఖ నిర్మించిన రాదారిపై అధిక బరువులు కల్గిన క్వారీ లారీలు నిత్యం ఆక్రమ రవాణా చేస్తూ ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు పూర్తిగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో క్వారీ లారీలను రాజ్యాంగబద్దంగా నిలువ రించాలని కోరుతూ మొదటి దశలో తుని ఆర్ అండ్ బి డిఈఈ, రౌతులపూడి ఏఈ, కత్తిపూడి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, శంఖవరం, రౌతలపూడి‌ మండలాల తాహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలకు జూన్ 9 న సామాజిక సేవాకర్తగా స్పందించి ఓ సామాజిక బాధ్యతగా ఫిర్యాదు చేశాను. వీరు ఏం చర్యలు తీసుకోలేదు. 16 రోజుల తరువాత రెండో దశలో జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆర్ అండ్ బి. ఎస్ఈ, పర్యావరణ ఇంజనీర్, డిటిసి, భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్, డిఇఓ, డిఎం అండ్ హెచ్ఓ, జెడ్పి సిఇఒ, పెద్దాపురం ఆర్డిఓ, డిఎస్పీ, ప్రత్తిపాడు సిఐలకు జూన్ 30 న ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఏ అధికారులు స్పందించలేదు. దీంతో చివరకు మూడో దశ ప్రయత్నంగా నిరాహార దీక్షకు పూనుకున్నా అని మేకల కృష్ణ వెల్లడించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో మైనింగ్ అక్రమ రవాణా వల్ల ప్రజలకు సమస్యలు పుంజు లాయిడ్ కంపెనీతో 1998 నుంచి ప్రారంభమై నేటికీ నిరవధికంగా 27 సంవత్సరాలుగా కొనసాగు తున్నాయని ఆయన వివరించారు. అయితే ఇదే మాదిరిగా అప్పట్లో కూడా తాను ఉద్యమించాను అన్నారు. ఐతే ఆ ఉద్యమం వివిధ రాజకీయ రాజకీయ పార్టీల వేదికగా చేపట్టడంతో నా ఉద్యమాన్ని ఆయా పార్టీలు తమ ఆర్ధిక స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని, ఆపై ఆ ఉద్యమం నుంచి నన్ను తప్పుదోవ పట్టించి వాడుకుని చివరకు తనను వదిలేసాయని గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో కొందరు యువకులు అడపా, దడపా ఉద్యమించి పోలీసు కేసుల చేదు ఫలితాలే చవి చూసారని తెలిపారు. ఉద్యమించగా బంగారయ్య పేటలో 60 మంది, శృంగవరం, మెరకచామవరంలో 40 మంది, శంఖవరంలో 94 మంది యువకులపై అక్రమ పోలీసు కేసులు నమోదు చేసారు. అందుకే తన ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలను గాని, రాజకీయ పార్టీలు, నాయకులను గాని కలుపుకుని పోవడం లేదని వివరించారు. ఐతే అక్రమ క్వారీ లారీల మాఫియా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బహిరంగంగా అంగీకరిస్తూ తనకు నైతిక మద్దతు తెలిపితే చాలన్నారు. ఈ ఉద్యమం నా ఆత్మ ప్రబోధం. స్వయం ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నన్ను నేను త్యాగం చేసుకుంటానే తప్ప వత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు, లంచాలకు తలొగ్గనని మేకల కృష్ణ ఘంటాపథంగా నొక్కి చెప్పారు. ఇప్పటికే తనపై కుట్రలు జరుగు తున్నాయని, భయపెట్టారని, ప్రలోభ పెట్టారని, ఈ నేపథ్యంలో పోలీసుల ముందస్తు రక్షణ హెచ్చరిక సూచనల మేరకు తన ఇంట్లో రక్షణకు సిసి కెమోరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానని ఆయన వెల్లడించారు.

తన ఈ ప్రజా ఉద్యమం పక్కాగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజా పక్షమేనని, ఈ ఉద్యమాన్ని ఏ ప్రభుత్వ పాలనలోనైనా చేపట్టే తీరుతానని, ఐతే ఇది ప్రభుత్వానికి, పార్టీలకూ, మైనింగ్ తవ్వకాలకు, రావాణాకూ వ్యతిరేఖం కానేకాదని, ఇందులో ఏ స్వీయ స్వార్ధ ప్రయోజనాలు లేవని, అలాగని దీనికి ఏ పార్టీల మద్దతు, ప్రోత్సాహం కూడా లేదని వివరించారు. తన ఉద్యమం ఆపేయాలంటే మైనింగ్ తరలింపునకు ప్రజా రవాణా రోడ్డు కాకుండా ప్రత్యామ్నాయ ప్రత్యేక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని మేకల కృష్ణ సూచించారు. ఇదే నియోజకవర్గంలో ఇదే మాదిరిగా మైనింగ్ రావాణాకు గతంలో చింతలూరు నుంచి రాచపల్లి జంక్షన్ వరకూ, వంతాడ నుంచి చిన్నింపేట వరకూ ప్రత్యేక ప్రత్యామ్నాయ రహదారులను మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నట్లే రౌతులపూడి, సరుగుడు మండలాల మైనింగ్ గ్రామాల నుంచి కత్తిపూడి వరకూ కూడా తాజాగా ప్రత్యేక ప్రత్యామ్నాయ రహదారులను నిర్మించుకోవాలని మేకల కృష్ణ సూచించారు. ఇదొక్కటే తన ఈ ప్రజా ఉద్యమ సమస్యకు ప్రధాన పరిష్కారం అనీ, అప్పుడే తన ఉద్యమం ఫలించినట్టని సామాజిక స్వయం సేవాకర్త మేకల కృష్ణ ప్రకటించారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..