

(మన న్యూస్ ప్రతినిధి ) ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 7 గురిపై కేసులు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి వారం రోజుల పాటు జైలు,ఆరుగిరికి రూ.10 వేల చొప్పున 60 వేల రూపాయలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కాటం భాను జరిమానా విధించారని ప్రత్తిపాడు సిఐ బి.సూర్య అప్పారావు అన్నారు.రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారని సిఐ బి.సూర్య అప్పారావు తెలిపారు.