

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ అధికారులు.* _స్వర్ణముఖి నదిలో ఇసుకను తరలింపుకు అనుమతించరాదనే జిల్లా కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న అధికారులు. పెళ్ళకూరు మండలం దిరసమాల, చావాలి, పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట తదితర గ్రామాల పరిధిలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా పరిశ్రమలకు ఇసుకను తరలిస్తున్న మాఫియా.* నాయుడుపేట మండలం తుమ్మూరు, అన్నమేడు, మర్లపల్లి, వేముగుంటపాళెం, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, కాపులూరు తదితర గ్రామాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో పరిశ్రమలతో పాటు ఇతర రాష్ట్రాలకు మాఫీయా ఇసుకను తరలిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వైనం. ఓజిలి మండలం జ్యోసులవారికండ్రిగ, కొత్తపేట తదితర గ్రామాల పరిధిలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి రాత్రినకా పగలనకా ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తున్న మాఫీయా. స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి ఆ ఆదేశాలను అమలు చేయని వైనం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికారులు అమలు చేయకుండా ఇసుక మాఫీయతో చేతులు కలిపి అనధికారికంగా ఇసుక తరలింపు ప్రక్రియలో ప్రత్యక్ష సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు.
ఇకనైనా జిల్లా కలెక్టర్ పెళ్ళకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాల అధికారుల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి సారించి ఇసుక మాఫీయతో చేతులు కలిపి ప్రత్యక్ష సహకారం అందిస్తున్న అధికారులపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు.
