

ప్రత్తిపాడు / శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- ప్రత్తిపాడు లో ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏర్పాట్లు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ రామిశెట్టి నాని తెలిపారు. జులై 8వ తేదీ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలో ఓమ్మంగి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మండల కన్వీనర్ రామిశెట్టి నాని రంగుల వేయించి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను గ్రామంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమ్మంగి గ్రామంలో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు జయంతి వేడుకల్లో పాల్గొంటారని రామిశెట్టి నాని తెలిపారు.