

- ఎంపీపీ పర్వత రాజబాబు..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీడీవో ఏ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వత గుర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పర్వత రాజబాబు మాట్లాడుతూ,వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున తగిన చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల డెంగ్యూ కేసు అచ్చంపేట, శంఖవరం గ్రామాల్లో నమోదు అయింది అని డాక్టర్ తెలపడంతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్య సిబ్బందితో సక్రమంగా శానిటేషన్ నిర్వహించాలని, వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయించాలని సూచించారు.అనంతరం వివిధ శాఖల అధికారులు మాట్లాడారు. అంగన్వాడి పోషక పదార్థాలు పాలు గుడ్లు లబ్ధిదారులకు అందజేయడం లేదని ప్రజా ప్రతినిధులు మండపడ్డారు. లబ్ధిదారులకు అందజేసేటప్పుడు ప్రజాప్రతినిధులు సమక్షంలో ఇవ్వాలని ఆదేశించారు. సర్పంచులు, ఎంపిటిసిలు కు ప్రోటోకాల్ పాటించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏజెన్సీ గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశమునకు మండల పరిషత్ ఉపాధ్యక్షులు దారా రమణ ,శ్రీమతి ఈగల చిన్నమ్ములు, యం.పి.టి.సి లు, సర్పంచులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.