

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి ఎస్ ఆర్ పురం మండలం దీపిక కళ్యాణ మండపంలో బుధవారం బాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాల మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఒక సంవత్సరం గడిచిన ప్రజలకు ఎలాంటి చేయలేదని మండిపడ్డారు రాష్ట్రంలో సంపద సృష్టి అని చెబుతూ ఎలాంటి సంపద సృష్టించకుండా అప్పుల భూమిలో పడేస్తున్నారని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బాబు నయవంచకుడు అని మోసాల మేనిఫెస్టో ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కుతాడని అన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రానున్న రోజుల్లో ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల అధ్యక్షులు మనీ , యువ నాయకుడు సాము, బొమ్మయపల్లి సర్పంచి గోవింద్, కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య, అశోక్ రెడ్డి,వెంకటరెడ్డి, శేఖర్ రాజు, విజయ్ కుమార్ రెడ్డి, పద్మనాదం రెడ్డి, తులసి యాదవ్, వైసిపి నాయకులు జనార్దన్ సర్పంచ్ సంఘ అధ్యక్షుడు దిలీప్ రెడ్డి,,బాబు, ఉమాపతి ఆనంద్,వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
