గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం..

  • మానవత్వంతో పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమం లో ఆశ్రమం కల్పించారు.
  • ఇలాంటి వారు ఎవరైనా కనిపిస్తే సహాయం అందించండి.
  • మీకై..మేము వెల్ఫేర్ అధ్యక్షులు దిలీప్ కుమార్

సాలూరు నవంబర్25( మన న్యూస్ ):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ మెంటలీ డిజేబుల్ అబ్బాయికి ఒక వ్యక్తి దుపట్టా పరుస్తుంటే అది చూసిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ స్పందిస్తూ స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.అప్పలనాయుడు కి తెలపడం జరిగింది.అలాగే మెంటల్లి డిజేబుల్ వ్యక్తి గురించి చుట్టుపక్కల అడగగా దీపావళి మరుసటి రోజు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నారు.ఎవరో వీరిని వదిలేసి వెళ్లిపోయారు అన్నట్లుగా పైగా ఒరిస్సా కు చెందిన అబ్బాయి లాగా ఉన్నారు అని సుమారుగా 15 నుంచి 19 వయసు ఉండొచ్చని భావిస్తున్నాము. వారి భాష కూడా హిందిలో మాట్లాడుతూ ఉన్నారు. అతని పరిస్థితి చూసి చలించిపోయి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వి.ఎస్ వాటర్ సర్వీసింగ్ వారి సహకారంతో అతని కి హెయిర్ కటింగ్,శుభ్రంగా స్నానం చేసి,బట్టలు వేసి నీటిగా తయారు చేయడం జరిగింది అన్నారు.అలాగే అక్కడున్న ముస్లిం ఆవిడ సఫియా కూడా అబ్బాయికి మూడు పూటలా భోజనం వండి తీసుకువచ్చి వారికి తినిపించేది అన్నారు. నవజీవన్ ప్యూర్ చిల్డ్రన్ హాస్టల్ చిక్కాల చిన్నమ్మలు వారికి భోజనం,పళ్ళు,బట్టలను అందించడం జరిగింది. విజయనగరం నుంచి దివ్యాంగుల అధ్యక్షులు సురేష్ వారు కూడా ఆ అబ్బాయికి సహాయాన్ని అందించారు.ఇలా రెండు రోజులు మేము వారి పరిస్థితిని చూడడం జరిగింది అన్నారు.తర్వాత మెంటల్లి డిజేబుల్ అబ్బాయిని పార్వతీపురం నిరాశ్రయ ఆశ్రమంలో అప్పగించడం జరిగింది.ఆశ్రయములో ఉన్నవారు కూడా అబ్బాయి పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఆశ్రయం కల్పించారు.ఎటునుంచి వచ్చారో తెలియదు,ఎవరో తెలియదు కానీ ఇదంతా మానవ దృక్పథంతో తోటి మనిషికి సహాయం చేయాలని ఉద్దేశంతో మాకు తోచిన సహాయం అందించడం జరిగింది. ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తులు కనిపిస్తే మీరు చేసే సహాయం మన దగ్గర ఉంచకపోయిన ఇలాంటి ఆశ్రమలు ఉన్నాయి కాబట్టి వారికి అప్పగించండి.ఎందుకంటే మనిషికి మనిషే సహాయ పడగలను కావున ఎవరైనా ఇలాంటి వ్యక్తులు కనిపిస్తే సహాయాన్ని అందించండి అని స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు కూడా మీకై.. మేము అధ్యక్షులు దిలీప్ కోరారు.వారికి సహాయాన్ని అందించిన వారు మీకే..మేము సభ్యులు క్రీస్తు రాజు,ఈశ్వరరావు,పట్టణ సీఐ బి.అప్పలనాయుడు, నవజీవన్ ప్యూర్ చిల్డ్రన్ హాస్టల్ చిక్కాల చిన్నమ్మలు, విజయనగరం సురేష్,వి ఎస్ వాటర్ సర్వీసింగ్, ముస్లిం సఫియా,

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///