కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి మాట్లాడుతూ తూర్పు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ డీ గా గుర్తించినా ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో ఓబీసీ సర్టిఫికెట్లు నిలుపుదల చేయడం వలన కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోస్టల్ రైల్వే ఎయిర్ ఫోర్స్ వంటి సంస్థల్లో తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలలో తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తుండగా ఉభయగోదావరి జిల్లాల్లో యువ్వక పోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాల్వంచ యశస్విని దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ జట్టు యూనియన్ నాయకులు తాండ్రోతు సత్తిబాబు, గెద్ద రాము, కంచు బోయిన నాగేశ్వరరావు, గొల్లపల్లి బాబురావు, కంది సత్తిబాబు, నోమ్సు రాజు, గెద్ద వెంకన్న ఉన్నారు.

  • Related Posts

    ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

    వెదురుకుప్పం,మన న్యూస్ , మే 3: వెదురుకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు శుభకార్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గారు ముఖ్య అతిథిగా…

    కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

    ఘనంగా వెదురుకుప్పం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు

    కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    కల్వరి అమౌంట్ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

    అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

    అల్లీపురం పీహెచ్సీకి మహర్దశ.. రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

    విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

    విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు